- ఎలాంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ కు బయలుదేరిన ఎమ్మెల్యే
మంథని, జనతా న్యూస్: మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకు ముందు మంథని మండలంలోని కన్నాల గ్రామం లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అలాగే మంథని పట్టణములోని శ్రీ మహాలక్ష్మి ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీధర్ బాబు సాదా సీదాగా ఎలాంటి ఆర్భాటం లేకుండా వెళ్లి మంథని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గతంలో నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ గా మంత్రిగా పనిచేశారు శ్రీధర్ బాబు ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు.