Medigadda Laxmi Brriage :మంథని, జనతా న్యూస్ : మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం బీజేపీ బృందం ఇక్కడ పర్యటించాలని నిర్ణయించడంతో బ్యారేజీపై ఉన్న దారులు బారీకేడ్లతో మూసివేశారు. గురువారం కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మేడిగడ్డను సందర్శించారు.ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ తరుణంలో బీజేపీ సైతం ఈ బ్యారేజీని సందర్శించాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా రాజకీయ నాయకులు సందర్శించడంపై ఉద్రిక్తలు నెలకొనే అవకాశం ఉందని ఇక్కడ 144 సెక్షన్ విధించారు. అయితే శనివారం బీజేపీ పట్టుబట్టి మరీ ఇక్కడికి వచ్చేందుకు రెడీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Medigadda Laxmi Brriage : మేడిగడ్డకు నేడు బీజేపీ బృందం..
- Advertisment -