Nepal Earthcake : నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో పలు చోట్ల భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ లోని ఖట్మాండ్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్ కోట్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ భూకంప పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. ఇది 11 మైళ్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి దాటిన తరువాత భూకంపం ఏర్పడింది. దీని తీవ్రతకు చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. భూకంప ధాటికి 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మరణించిన వారి సంక్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
భారీ భూకంపం.. 128 మంది మృతి
- Advertisment -