వరంగల్, జనతా న్యూస్: ఎన్నికలకు సర్వత్రా సంసిద్ధం గా ఉన్నామని నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక అన్నారు.శుక్రవారం ఐడిఓసిలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలోని మీడియా సెంటర్లో డి పి ఆర్ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాతికేయల సమావేశంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని ఎన్నికలను పారదర్శకత, జవాబుదారితనం తో నిర్వహిస్తామన్నారు.
నేటి నుండి అనగా మూడో తేదీ నుండి పదవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ సెలవల్లో నామినేషన్లు ప్రక్రియ ఉండదన్నారు.జిల్లాలో నాలుగు లక్షల 67 వేల మంది ఓటర్లు ఉన్నట్లు ఓటర్లకు అనుకూలంగా 539 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అక్టోబర్ 31 వరకు మదర్ ఓటర్ రోల్ పూర్తయినట్లు చెప్పారు ఈనెల 10వ తారీఖు వరకు సప్లమెంటరీ రోల్ పూర్తి చేస్తామన్నారు.
పోలింగ్ సిబ్బందికి కూడా మొదటి విడతగా అక్టోబర్ 31వ తేదీన నవంబర్ 1వ తేదీన రెండు రోజులు ఎన్నికల పోలింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని సుమారు 1003 ప్రోసైడింగ్ అధికారులు, మరో వెయ్యి మూడు సహాయ ప్రొసైడింగ్ అధికారులకు మొత్తంగా 773 పోలింగ్ స్టేషన్ల కు గాను 2006 మందికి మొదటిగా రాండమైజేషన్ పూర్తిచేసుకోవటం జరిగిందని ఈనెల 15 తర్వాత రెండవ రాండమైజేషన్ పూర్తి చేస్తామన్నారు.పోలింగ్ కేంద్రాలకు రాలేక ఓటు వేయలేని పరిస్థితి లో ఉన్న దివ్యాంగులు తోపాటు 80 సంవత్సరములు దాటిన వృద్ధులకు కూడా ఇంటి నుండే ఓటు హక్కు కల్పించేందుకు 18,900 మందికి 12 డి ఫారం ను అందించామన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 7 ఎస్ ఎస్ టి టీములను ప్రతి నియోజకవర్గంలో 24/7 విధులు నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు .వాహనాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని జిపిఎస్ కు లింక్ చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలన్నారు.సి విజిల్ యాప్ ద్వారా 29 ఫిర్యాదులు స్వీకరించి 18 పరిష్కరించామని 11 ఫిర్యాదులు తగిన ఆధారాలు లేకపోవడంతో తొలగించడం జరిగిందన్నారు 18 ఫిర్యాదులలో 8 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు
నవంబర్ 30వ తేదీ ఐదు గంటలకు ముందుగా 48 గంటలు అనగా 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచారాన్ని నిలుపుదల చేయాలన్నారు. లేనిచో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.డోర్నకల్ 89 మహబూబాబాద్ 84 శాతాలతో గతంలో ఓటింగ్ నమోదు కాగా జిల్లాలో 86% ఓటింగ్ నమోదై ఉందన్నారు. పట్టణ ప్రాంతంలో తక్కువగా నమోదు కావడం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పోలింగ్ నమోదు అవ్వడం తగు కారణాలను కూడా విశ్లేషించడం జరిగిందన్నారు స్వీప్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ఓటర్ నమోదుకు చర్యలు తీసుకున్నామని అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా చైతన్య పరుస్తామన్నారు.
జిల్లాలో (వనరల బుల్) సమస్యాత్మకంగా ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు తక్షణం చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలియజేశారు.ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీలో భాగంగా 87 వేల కార్డులకు గాను 69 వేలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 18 వేలకు సంబంధించి కార్డులు ప్రింట్ అవుతున్నాయని, వెంటనే పంపిణీ చేస్తామన్నారు.అనంతరం ఎన్నికల పోలింగ్ విధానాన్ని, ఓటర్ చైతన్యం కొరకు ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పాత్రికేయులకు ఓటు హక్కు బాధ్యతగా వినియోగించుకోవాలని తెలియజేసే బ్యాడ్జి లను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ డేవిడ్ ఎం సి ఎం సి కమిటీ మోడల్ అధికారి సురేష్, పశుసంవర్ధక శాఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.