Team India :టీమిండియా క్రికెటర్లు శ్రీవారి సేవలో తరించారు. ఇండియా క్రికెటర్లు రిషబ్ పంత్, ఆక్షర్ పటేల్ లు కలిసి శుక్రవారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇద్దరు తెల్లటి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వీరిని చూసిన అక్కడి వారు వారితో సెల్ఫీలు దిగారు. ప్రపంచ కప్ లో రిషబ్ పంత్, అక్షర్ పటేల్ లు లేరు. అయినా ఇంటి నుంచే మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామని ఈ సందర్బంగా వారు మీడియాకు తెలిపారు. రిషబ్ పంత్ కు ఏడాది కిందట కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన విషయం తెలిపిందే. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకొని ప్రస్తుతం వ్యాయామం చేస్తున్నారు.
Team India : శ్రీవారిసేవలో టీమిండియా క్రికెటర్లు.. సెల్ఫీలతో సందడి
- Advertisment -