Varun Tej : సినీ సెలబ్రెటీ వరుణ్ తేజ్, లావణ్యల త్రిపాఠి ల వివాహం నవంబర్ 1న వైభవంగా జరిగింది. ఈ వేడుకకలు ఇండియా నుంచి మెగా ఫ్యామిలీతో పాటు హీరో నితిన్ హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే హల్ చల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరి వివాహం గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మెగా హీరో వివాహం ఇండియాలో కాకుండా ఇటలీలో నిర్వహించారు. అయితే ఈ పెళ్లికి అయిన ఖర్చుపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ వేడుకను నిర్వహించగా.. అన్నీ హైటెక్ అంగులతో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వధూవరులు ధరించిన డ్రెస్సెస్ చాలా ఖరీదైనవని సమాచారం. పెళ్లి కూతురు లావణ్య రెడ్ సారీలో సాంప్రదాయం గా కనిపించారు. ఈ చీర ఖరీదు రూ. 10 లక్షలు అని సమాచారం. మొత్తంగా పెళ్లి కోసం రూ.10 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. అయితే ఈ ఖర్చు మొత్తం నాగబాబు భరించినట్లు తెలుస్తోంది.
Varun Tej : వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లికి ఎన్నికోట్లు ఖర్చుపెట్టారో తెలుసా?
- Advertisment -