అమెరికాలో తెలుగురాష్ట్రానికి చెందిన మహిళ మృతిచెందారు. అయితే ఆమె మరణానికి కుటుంబ కలహాలే కారణమని మహిళ సోదరుడు జయశంకర్ ఆరోపిస్తున్నారు. ఆసల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నమ్రతతో కృష్ణ జిల్లా మచిలీ పట్నానికి చెందిన జాన్ తో 2006లో వివాహం అయింది. జాన్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటారు. దీంతో అమెరికాలోని అట్లాంటాలో ఉద్యోగరం రావడంతో అక్కడే నివసిస్తున్నాడు. వివాహం అయిన కొన్ని రోజుల తరువాత నమ్రతను అక్కడికి తీసుకెళ్లారు. అయితే కొన్నాళ్లు సజావుగా కాపురం చేసిన వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
అయితే భర్తే నమ్రతను సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని ఒత్తిడి చేసేవారని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట ఆమె వాల్ మార్ట్ లో ఉద్యోగంలో చేరారు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో నమ్రతను వేధింపులకు గురిచేసేవారని అన్నారు. దీంతో ఆమెకు 2018లో గుండెపోటుకు గురయ్యారు. ఆ తరువాత గొడవలు కొనసాగగా… అక్టోబర్ 22న ఉదయం ఆదివారం ఇంట్లో వంట చేస్తూ గుండెపోటుతో నమ్రత చనిపోయారు. అయితే మృతదేహాన్ని ఇక్కడి తీసుకురావాలని కోరినా.. అక్కడే అంత్యక్రియలు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా అమెరికాకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు.