మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యల త్రిపాఠిల వివాహం వైభంగా జరిగింది. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల మధ్య అతికొద్ది మంది ఆహ్వానిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హిందూ సాంప్రదాయం ప్రకారంగానే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్య మాత్రం ఉత్తరాది సాంప్రదాయంలో కనిపించారు. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం నుంచి చిరంజీవి, అల్లు అర్జన్, తదితరులు ఇటలీకి వెళ్లారు. వీరి పెళ్లి తరువాత వారిని ఆశీర్వదించారు.
వైభవంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం
- Advertisment -