- వేద విద్యకు పూర్వ వైభవం తెప్పిస్తాం
- శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ చైర్మన్ సాయినాథ శర్మ
Manthani : మంథని, జనతా న్యూస్:వేదం ధర్మాన్ని రక్షిస్తుందని దేశాన్ని సుభిక్షంగా ఉంచుతుందని శ్రీ జనార్ధనా నంద సరస్వతి స్వామి సంస్థ ట్రస్ట్ చైర్మన్ దూములూరి సాయినాథ శర్మ తెలిపారు. బుధవారం నృసింహ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేదమును రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేదమును రక్షించడానికి పరమాత్ముడు ముత్యావతారం ఎత్తాడని ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో ఘనపాటుల సంఖ్య చాలా తగ్గిపోయిందని గణాపాటులను తయారుచేసే సంకల్పంతో వేదకు విద్యకు పూర్వవైభవం రావడానికి ఈ సంస్థ పనిచేస్తుందన్నారు.
జిల్లాకు ఒక వేద సభ ఉండాలని వేదం ధర్మాన్ని రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. వేద గడ్డగా మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో ఈ సభ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సభలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం రోజున మంథని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వేదం చదువుకున్న విద్యార్థులందరికీ కూడా మంథనిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి, కల్వకుర్తి, భద్రాచలం తదితర ప్రాంతాల నుండి వేద పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులందరికీ ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇక్కడికి వచ్చిన విద్యార్థులు పదో తరగతి ఇంటర్ డిగ్రీ విద్యను అభ్యసించిన వారన్నారు. వీరికి ప్రభుత్వం ఎలాంటి వేద విద్య పరీక్షలు నిర్వహించదని అలాంటివారికి వేద విద్యలో గుర్తింపు సర్టిఫికెట్ ఎంతో అవసరమన్నారు. అలాంటి వారికి గణాపాటిగా గుర్తింపు ఇవ్వాలని సదువుద్దేశంతో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్థ ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పాటున అందిస్తుందని ఆయన కొనియాడారు. అలాగే మంథనిలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు గ్రాంట్ మంజూరు చేసిందని గుర్తు చేశారు.
అనంతరం ట్రస్ట్ కార్యదర్శి బ్రహ్మానంద శర్మ మాట్లాడుతూ గతంలో వేద విద్యార్థులు పరీక్షలు రాయడానికి రాజమండ్రి వెళ్లేవారని అలాంటి వారికి మంథనిలో పరీక్షలు నిర్వహించాలని తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2002లో ఈ పరీక్షల నిర్వహణ ప్రారంభమైందని 2006లో మంథనిలో 60 మంది పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. 2023లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 500 మంది పైచిలుకు విద్యార్థులు ఇక్కడికి వచ్చారని ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో గట్టు నారాయణ గురూజీ తోపాటు సీతారామ సేవా సదన్ అధ్యక్షుడు హరిబాబు, నల్లగొండ హరి, శశి భూషణ్ కాచే, దుద్దిల్ల గణపతి, పల్లి ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.