స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. చంద్రబాబుకు అనారోగ్యం కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఆయనకు కంటి సమస్యలు ఉన్నాయని, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి అని ఆయన వాదనలు వినిపించారు.దీంతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో కొన్ని షరతులను విధించింది.
- రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలి.
- ఇద్దరు షూరిటీని ఇవ్వాలి.చంద్రబాబు ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో నైనా చికిత్స తీసుకోవచ్చు.
- అయితే అందుకు సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించాలి.
- ఈ కేసుకు సంబంధించి ఎవరినీ ప్రభావం చేయొద్దు.
- నవంబర్28న సరెండర్ కావాలి.