Brs Mp : బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ పై కత్తితో దాడి జరిగింది. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గటని రాజు అనే వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేవారు. తీవ్రంగా గాయపడిన ఎంపీని కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. అయితే గటని రాజును కార్యకర్తలు పట్టుకొని ఆయనపై దాడి చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం సూరంపల్లి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన కారు నుంచి దిగి వస్తంండగగా రాజు కత్తితో దాడి చేసినట్లు కార్యకర్తలు పేర్కొంటున్నారు. నిందితుడిది మిరుదొడ్డి మండలం, చెప్పల గ్రామం. ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలియగానే మంత్రి హరీష్ రావు వెంటనే ఫోన్లో పరామర్శించారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం యశోధ ఆసుపత్రికి తరలించారు.
Brs Mp : బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి..
- Advertisment -