- పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ క్రిస్టోఫర్ తిలక్
హుజూరాబాద్, జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమ సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పని చేయాలని పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్ క్రిస్టోఫర్ తిలక్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ గ్రామాన పార్టీ చేసిన, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన కార్యకర్తలకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండకట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెన్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, కమలాపూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు నుంకరి రమేష్, జమ్మికుంట మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరిరేణుక,శివకుమార్, యూత్ కాంగ్రెన్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.