Thursday, July 3, 2025

Karimnagar : సి విజిల్, సువిధ యాప్ ల గురించి అవగాహన కల్పించాలి

  • చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు పకడ్బందీగా జరిగేలా చూడాలి
  • వికలాంగులు, 80 సంవత్సరాలు పైబడి పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేయాలి
  • నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

కరీంనగర్, జనతా న్యూస్ : రాబోయే సాధారణ ఎన్నికలను సరైన ప్రణాళికతో పారదర్శకంగా నిర్వహించి విజయంతం చేయాలని, సి- విజిల్ యాప్ గురించి, స్వీప్ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలోని ప్రజల వరకు తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో రిటర్నింగ్ అధికారులతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధత, ఫామ్ -6,7,8, ఎలక్టోరోల్, జండర్ రేషియో, పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు, ఇతర ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ, సంసిద్ధతపై జిల్లాల వారిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయా జిల్లాల్లో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఈఓ కు జిల్లా ఎన్నికల అధికారులు వివరించారు.

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఈఓ మాట్లాడుతూ, జిల్లాలోని నియోజకవర్గాల వారిగా సమస్యాత్మకమైన (vulnerable ) పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల నుండి కూడా సలహాలను స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమీక్షించుకోవాలని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. అదే విధంగా ఆర్.ఓ ల ద్వారా జారీ చేసె అనుమతుల గురించి తెలుసుకున్నారు. సువిధా మొబైల్ యాప్, యూజర్ చార్జీల గురించి తెలియపరచాలని. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల నుండి తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తీసుకునే చర్యలపై జాప్యం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, వాల్ రైటింగ్ లేకుండా వెంటనే తొలగించాలన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని, పట్టుబడిన వాటిని ఎన్నికల నియావళి మేరకు సీజ్ చేయాలని, ఎన్నికల సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా పట్టుబడిన వాటిపై బృందాల ద్వారా సమీక్షించుకుని త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహించే సిబ్బంది హజరు, పనితీరును సిసి కెమరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు.

ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, ఇదివరకు జారీచేసిన లైసెన్స్డు ఆయుదాలను తిరిగి స్వాదీనం చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన ప్రాంతాలపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టిసారించి పొలింగ్ శాతం పెంచేదిశగా కృషిచేయాలని. ఓటరు జాబితాలో డూప్లికేట్, డబుల్ ఓటర్లు లేకుండా సరిచూసుకోవాలని, ఒకే ఇంటినెంబరుపై ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లయితే వాటిని స్వయంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజలకు ఓటు ప్రాదాన్యతను గురించి వివరిస్తునే, వికలాంగులు మరియు 80 సంవత్సరాలు పైబడి పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి కల్పిస్తున్న సౌకర్యాలను గురించి తెలియజేయాలన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఓటు విలువను తెలియచేప్పేలా సదస్సులను నిర్వహించి, పిల్లల తల్లితండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఓటు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

ప్రతిరోజు జిల్లాల్లో స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి ప్రజలకు తెలియజేయాలని. నియోజక వర్గాలలోని గోడౌన్లు, షాదిఖానాలు, అనుమానిత గృహలలొ తనిఖీలు చేపట్టలన్నారు. ఎక్కువ మొత్తంలో, ఎక్కవ సార్లు జరిగే బ్యాంకు లావాదేవిలపై దృష్టి సారించాలని, వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు బ్యాంకర్లు తెలియజేయకపోతే అట్టి వివరాలు సిఈఓ కార్యాలయాలనికి పంపించాలన్నారు. క్యూఆర్ కోడ్, సరైన పత్రాలు లేకుండా బ్యాంకులు తరలించే నగదును సీజ్ చేయడంతో పాటు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్బన్, రూరల్ ప్రాంతాలలో బిఎల్ఓలు నిర్వహించే ఎన్నికల విధులను ఎప్పటికప్పడు పరిశీలించాలని, వనరబుల్ పోలింగ్ ప్రాంతాలలో సిసి కెమరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.

నామినేషన్ల స్వీకరణ మొదలు కాబోతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన బందొబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సిసి కెమరాలు ఏర్పాటు చేయడంతో పాటు నామినేషన్ ల ప్రక్రియను వీడియో రికార్డు చేయించాలని తెలిపారు. వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని, ఎన్నికల సామాగ్రి అప్పగింత, తరలింపులో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, సిఈఓ కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, డి ఐ జి కే రమేష్ నాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రఫుల్ దేశాయ్, యాస్మిన్ బాషా, ముజమ్మిల్ ఖాన్, కెమ్యా నాయఖ్, రామగుండం సిపి రెమా రాజేశ్వరి, ఎస్పిలు, రిటర్నింగ్ అధికారులు, పోలీస్ నోడల్ అధికారులు పాల్గోన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page