Manthani : మంథని, జనతా న్యూస్: ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని చోట్లా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగానే మంథని పట్టణం గంగపూరి లో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ వాహనాన్ని వారి వెంట ఉన్న వాహనాలన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎన్నికల వేళ అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసుల పనితీరు పట్ల పుట్ట మధూకర్ అభినందనలు తెలియచేసి ఇదే స్పూర్తితో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
Manthani : ముమ్మరంగా వాహనాల తనిఖీలు
- Advertisment -