Aiswarya Sarja: సీనియర్ హీరో అర్జున్ కూతురు ఎంగేజ్మెంట్ చెన్నైలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ఆహ్వానితుల మధ్య జరిగిన ఈ వేడుకలో ఐశ్వర్య సర్జా, కాబోయే వరుడు ఉమాపతి రామయ్య మెరిశారు. ఐశ్వర్య సర్జా, ఉమాపతి రామయ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తరువాత వీరు పెద్దలను వివాహానికి ఒప్పించారు. ఐశ్వర్య సర్జను పెళ్లి చేసుకోబోయే ఉమాపతి రామయ్య కోలీవుడ్ నటుడు. ఈయన తండ్రి తంబి రామయ్య హాస్య నటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు. ఐశ్వర్య సైతం 2013లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పట్టుట్టు యానై’ అనే సినిమాలో మొదటిసారిగా కనిపించింది.
Aiswarya Sarja: ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా ఎంగేజ్మెంట్
- Advertisment -