Onion Price : హైదరాబాద్, జనతాన్యూస్ : ఉల్లి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.100 చొప్పున పలికింది. ఉల్లి పండించే ప్రాంతాల్లో వర్సాలు సరిగా లేకపోవడంతో పాటు ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్లు కలిగిన కర్ణాటక, మహారాష్ట్రలల్లో భారీ వర్షాలు కురియడంతో నిల్వ చేసిన ఉల్లి దెబ్బతిన్నది. దీంతో ఉల్లి కొరత ఏర్పడిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో ఉల్లి పంట విస్తీర్ణం తగ్గింది. దీంతో హైదరాబాద్ కు రావాల్సిన 100 లారీల ఉల్లి పంటలో కేవలం 20 లారీలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. గత 15 రోజులుగా ఉల్లి తో వచ్చే లారీలు తగ్గిపోయాయిన అంటున్నారు.
కరీంనగర్ లోని మార్కెట్ లో శనివారం ఉల్లిని రూ.100తో విక్రయించాలి. ఎర్ర ఉల్లి రూ.80కి అమ్ముతున్నారు. మిగతా ప్రాంతాల్లో కాస్త తగ్గినా ఇక్కడే అధికంగా ధర పలుకుతోంది. ఉల్లి కొరత కారణంగానే ధర ఈ స్థాయిలో ఉందంటున్నారు. గతంలో కొన్ని రోజుల పాటు టమాటా ధరలు బెంబేలెత్తించాయి. కిలో రూ.200 వరకు విక్రయించారు. ప్రస్తుతం రూ.20తో అమ్ముతున్నారు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఉల్లిధరలు పెరుగుతాయని అన్నారు. కానీ ఆ సమయంలో ఉల్లి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉల్లిధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.