Telangana Congress : హైదరాబాద్, జనతా న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ రెండో జాబితా రానే వచ్చింది. ఈసారి కీలక నేతల పేర్లు ఖరారు చేశారు. పార్టీ ఇప్పటికే 55 మందితో మొదటి జాబితాను అక్టోబర్ 15న విడుదల చేసింది. ఆ తరువాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ పేర్లు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ నివాసంలో పలుమార్లు సమావేశం అయ్యారు. బుధవారం మరోసారి నిర్వహించిన సీఈసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతలు మల్లు భట్టి వక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేశారు. అయితే మూడో జాబితా ఆ తరువాత విడుదల చేస్తారని తెలుస్తోంది.
Telangana Congress : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. అభ్యర్థుల వీరే..
- Advertisment -