Saturday, July 5, 2025

Varun Tej: పెళ్లికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్.. ఇటలీ వెళ్లడానికి అంతా సిద్ధం..

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకను ఇటలీలో నిర్వహించాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించింది. దీంతో ఇరుకుటుంబ సభ్యలు ఇటలీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వివాహం తరువాత ఇక్కడికి వచ్చిన తరువాత నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించే అవకాశం ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి వివాహాన్ని ఇటలీలో ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. కాగా మెగా కుటుంబ సభ్యులంతా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page