తెలంగాణలో ఏపీ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆంధప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబను ఖమ్మంలో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గురువారం రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఖమ్మంలోని ఓ హోటల్ లో బస చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శుక్రవారం హోటల్ ను చుట్టుముట్టారు. అనంతరం ఆయన కారును అడ్డుకొని జై చంద్రబాబు అని నినాదాలు చేశారు. ఆ తరువాత ఖమ్మ పోలీసులు అక్కడికి చేరుకొని టీడీపీ నాయకులను చెదరగొట్టారు. ఆ తరువాత మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.
తెలంగాణలో ఏపీ మంత్రికి చేదు అనుభవం
- Advertisment -