జనతా న్యూస్ బెజ్జంకి : మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల గ్రామాల నుండి, ఇల్లంతకుంట మండలం అర్సక్కపేట గ్రామం బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ముత్యం భాగ్యలక్ష్మి తన అనుచర వర్గంతో మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, అలాగే బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గూడెం గ్రామానికి చెందిన అనేకమంది యువకులు గురువారం బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులుతదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ కాంగ్రెస్ లో చేరికలు
- Advertisment -