Devaragattu : దసరా పండుగ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన దేవరగట్టు మరోసారి రక్తసిక్తంగా మారింది. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు ప్రజలు చెట్ల కొమ్మలపై కూర్చొని చూశారు. అయితే ప్రమాదవశాత్తూ చెట్లు కొమ్మలు విరిగిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఒకరు మరణించారు. ఈ ఉత్సవంలో మొత్తంగా 100 మందికి గాయాలైనట్లు సమాచారం. ఎంత మంది పోలీసులు ఉన్నా.. అధికారులు ఈ కర్రల సమరంపై ప్రత్యేక దృష్టి సారించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పురాతన కాలం నుంచి దేవరగట్టులో కర్రల సమరం కొనసాగుతూ వస్తోంది. ఇది దేవుడి కోసం జరిగే పోరాటం. ఉత్సవమూర్తులను కాపాడుకోవడానికి మూడు గ్రామాలు.. ఆ స్వామివారిని దక్కించుకోవడానికి 6 గ్ామాల వారు ఒకవైపు కర్రల సమరంలో పాల్గొంటారు. కర్నూలు జిల్లా హోలగొంద మండల దేవరగట్టులో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
బన్నీ ఉత్సవాల్లో భాగగా తాండా, నేరినికి, కొత్త పేట గ్రామాల ప్రజలు ఒక వర్గంగా ఉంటారు. విరూపాపురం, ఎల్లార్తి, హరికేర, బిలేహల్, నెట్రవట్టి మరో గ్రూపుగా ఉంటారు. వీరు ఒక చేతిలో పెద్ద దీపం పట్టుకొని కొండల్లో నుంచి వాయిద్యాలతో బయలుదేరుతారు. ఆ రాత్రి 12 గంటల సమయంలో దేవరగట్టకు చేరుకుంటారు. ఆ తరువాత మాలమల్లేశ్వర కల్యాణం జరుగుతుంది. కల్యాణం తరువాత ఉత్సవ విగ్రహం కోసం జైత్రయాత్ర ప్రారంభం అవుతుంది. దీంతో దేవుడి విగ్రహాలను ముట్టుకునేందుకు ప్రజలు ఒకరిపై ఒకరు మీదపడిపోతారు. అలా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి మారింది. అయితే ఈ ఉత్సవం కేవలం సాంప్రదాయం అని, కర్రల సమరం కాదని పూజారులు పేర్కొంటున్నారు.