కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోప భూయిష్టమైనది
కుంగిన బ్యారేజీలను చూడడానికి మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రావాలా?
ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
Kaaleswaram : మంథని, జనతా న్యూస్: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన ప్రమాదంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుస్పందించారు. శనివారం సాయంత్రం సమయంలో భారీ శబ్ధంతో బి- బ్లాక్ లోని 18 ,19,20,21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయిన విషయంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టమని దీనికి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ సెక్రెటరీ పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. తక్కువ సమయంలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కుంగిపోయిన బ్యారేజ్ పై ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. లక్షల కోట్ల ప్రజల సొమ్మును నీళ్లలో పోశారని ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని రీ డిజైనింగ్ సరికాదని ముమ్మాటికిఇదిమానవతప్పిదమేని కుంగిన బ్యారేజ్ లను మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చూడడానికి రావాలా అని ఎద్దేవా చేశారు