Saturday, July 5, 2025

భూ సంస్కరణణలు అమలవుతున్నాయా?

-ఎన్నికల కోడ్ లో మహనీయుల విగ్రహాలకు పూలదండలు వేస్తారా?

-బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరైoది కాదు.

మంథని, జనతా న్యూస్: రాహుల్ గాంధీ పర్యటనను జీర్ణించుకోలేని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై,రాహుల్ గాంధీపై అడ్డగోలుగా విమర్శలు చేయడం సరైంది కాదని పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు శశిభూషణ్ కాచే,ఎంపీపీ కొండ శంకర్ ఆరోపించారు.శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీధర్ బాబు పిలుపుమేరకు మంథని నియోజకవర్గంలో 70 కిలోమీటర్ల పరిధిలో రాహుల్ గాంధీ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో దేశానికి ఒక ఆశాజ్యోతి అని భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నడకతో పాదయాత్ర చేపట్టి ఒక పర్నితిగా చెందిన నాయకుడిగా దేశ భవిష్యత్తు కోసం పాటుపడే గొప్ప వ్యక్తిగా రాహుల్ గాంధీ ఉన్నారని, అటువంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

పివీ నరసింహారావును కాంగ్రెస్ నాయకులు,రాహుల్ గాంధీ విస్మరించరని
ఆనడంలో నిజం లేదన్నారు.పీవీ నరసింహారావు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ నాయకుడని,భూ సంఘసంస్కర్తని,వారు ఆయన సేవలను కొనియాడారు.పీవీ నరసింహారావు చేపట్టిన భూసంస్కరణ,ఆర్థిక సంస్కరణలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు అవుతున్నాయా అని వారు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మహానుభావుల విగ్రహాలకు పూలదండలు వేస్తుందా?. తెలుసుకొని మాట్లాడాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల నియామ వాళిని హైదరాబాద్ నుండి మొదలుకొని గ్రామ గ్రామాన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. అధికారులు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని వారు కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు ఉండాలి కానీ అసంబద్ధంగా ఉండకూడదన్నారు.

ఎన్నికల కోడ్ ఉందన్న విషయం మర్చిపోయి విగ్రహాలకు పూలమాలలు వేయలేదనడం సక్రమమైన విమర్శ కాదన్నారు.ఏ పార్టీలో కొనసాగిన ఆ పార్టీలో సక్రమంగా పనిచేస్తామన్నారు.కింది స్థాయి వారితో విమర్శలు చేయిస్తే,మేము ప్రతిదానికి ఆధారాలతో చూపెడుతూ జవాబు ఇవ్వవలసి వస్తుందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించవలసిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో. మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్. వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మంథని పట్టణ అధ్యక్షులు పోలు శివ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజీమ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న,,వైస్ ఎంపీపీ స్వరూప్ , యూత్ కాంగ్రెస్ మంథని పట్టణ అధ్యక్షులు పెంటరి. రాజు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page