Andhrapradesh :ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన వారు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ లతో గవర్నర్ జస్డిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, న్యాయమూర్తులు హాజరయ్యారు. కాగా ఇటీవల ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh :అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
- Advertisment -