Gaganyaan :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్ యాన్ టెస్ట్ అబార్డ్ మిషన్ ( TV-D1) ప్రాజెక్టు మొత్తానికి సక్సెస్ అయింది. శనివారం ఉదయం 8 గంటలకు శ్రీహరికోట నుంచి TV-D1 చేపట్టాల్సి ఉండగా కొద్దిపాటి మంటలు రావడంతో గుర్తించిన శాస్త్రవేత్తలు వెంటనే ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక సమస్యను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.వెంటనే సరిచేశారు. ప్యారాచుట్ లు సైతం సమయానికి తెరుచుకున్నాయి. ఆ తరువాత క్రూమాడ్యూల్ పారాచుట్ ల సహాయంతో సురక్షితంగా సముంద్రంలోకి ల్యాండ్ అయింది. దీంతో కీలక సన్నాహక ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గగన్ యాన్ కు ముందు నిర్వహించే నాలుగు పరీక్షల్లో టెస్ట్ వెహికిల్ అబర్ట్ మిషన్ మొదటిది. గతంలో 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినా అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే ఈసారి అన్ని పరీక్షలు నిర్వహించి సక్సెస్ చేశారు.
Gaganyaan : సాంకేతిక లోపాన్ని సవరించుకొని దూసుకెళ్లిన గగన్ యాన్
- Advertisment -