chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ పొడగించారు. ఈ కేసులో గతంలో విధించిన రిమాండ్ గురువారంతో ముగిసింది. ఈ నేపైథ్యంలో జైలు అధికారులు వర్చువల్ గా విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇదిలా ఉండగా జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని ఏసీబీ కోర్టుకు తెలపగా.. చంద్రబాబు రాసే లేఖ పరిశీలించాలని రాజమండ్రి జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కూడా రిపోర్టులు ఇవ్వడం లేదని, ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేసిన నేపథ్యంలో వాటిని పరిశీలించాలని న్యాయస్తానం ఆదేశించింది.
chandrababu : చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ పొడగింపు
- Advertisment -