తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అయినా ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే ఒడిశా గవర్నర్ గా జార్ఘండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ ను నియమించారు తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి రంగారెడ్డి జిల్లా వాసి. ఆయన మలక్ పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత పార్టీ నామినేటేడ్ పదవుల్లో కొనసాగారు. 2003 నుంచి 2007 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరువాత 2014లో బీజేపీ జాతీయ కార్యవర్గంలో పనిచేశారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని గవర్నర్ గా ఎలా నియమిస్తారు? అని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
త్రిపుర గవర్నర్ గా తెలంగాణ బీజేపీ నేత..
- Advertisment -