Thursday, July 3, 2025

కోటి గెలుచుకున్న ఎస్ఐ.. కానీ అంతలోనే ఆనందం ఆవిరి..

ఆయన ఓ బాధ్యతాయుత పోలీసు అధికారి. జూదాలు, బెట్టింగులకు వ్యతిరేకంగా ఉండాల్సిన వ్యక్తి. అలా ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీస్. కానీ స్వయంగా ఆయనే బెట్టింగులో పాల్గొన్నాడు. అదృష్టం కొద్దీ అతనికి లక్కు తగిలింది. కోటి రూపాయల వరకు గెలుచుకున్నాడు. దీంతో ఆ పోలీసలు అధికారి కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. మిఠాయిలు పంచుకున్నాడు. కానీ అంతలోనే ఆనందం ఆవిరైంది…ఏం జరిగిందంటే?

2023 వరల్డ్ కప్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగులు జోరుగు సాగుతున్నాయి. ఈ క్రమంలో డ్రీమ్ 11 అనే బెట్టింగ్ యాప్ ద్వారా కొందరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది చూసిన ఓ ఎస్ ఐకి ఆశ కలిగింది. మహారాష్ట్రలోని పంప్రీ -చించ్వాడ్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సోమనాథ్ అక్టోబర్ 10న విధుల్లో ఉండగా డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్ లో పాల్గొన్నాడు. ఆరోజు జరిగిన ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ బెట్టింగులో పాల్గొన్నాడు. దీంతో అతను ఫాంటసీ గెలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

కానీ ఇంతలోనే ఆనందం ఆవిరైంది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలు అతిక్రమించి పోలీసు విధుల్లో ఉండి బెట్టింగులకు పాల్పడడం సరైంది కాదని, అతనిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏసీపీ సతీష్ మానే తెలిపారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page