కరీంనగర్ టౌన్,(జనత న్యూస్) కరీంనగర్ పట్టణంలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపం లో మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆద్వర్యంలో కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల అతిథిగా హాజరయ్యారై 2023 శాసన సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూతు కన్వినర్లు, కో కన్వినర్లకు పలు అంశాల పై సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులను బలోపేతం చేయాలన్నారు.
కెసిఆర్ లేని తెలంగాణ ఊహించుకొలేమని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఓటు విషయం లో ఒక్క సారి తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని అన్నారు. పచ్చని తెలంగాణ లో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదేళ్ల కెసిఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరోసారి కెసిఆర్ పాలన కోసం సిద్దంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీ ఆర్ ఎస్ పార్టీ 90 కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి రానున్నమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలకే పరిమితం అని కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని అన్నారు.
45 రోజులు నా కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. పదవులు ఎన్ని వచ్చినా తను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే మా బలం మా ధైర్యం అని అన్నారు. నాలుగోసారి ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నెల 18వ తేదీన ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. మరో వైపు మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మంత్రి గంగల కమలాకర్ ను నాలుగో సారి గెలిపించి కరీంనగర్ నగర అభివృద్ధిని ఇంకా ముందుకు తీస్కెల్లేలా మనమంతా కృషి చేయాలన్నారు. మరో వైపు రాష్ట్రం లో ముచ్చటగా మడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి గా రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో నడిపించి అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందించాలన్నారు. ఇవన్ని దృష్టి లో పెట్టుకొని పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను కంఖన బద్దులై నిర్వహించాలన్నారు.
పట్టణాలతో పాటు గ్రామాలు, మండలాల్లో ప్రజలతో మమేకమై ప్రజల మద్దతును అభిమానాన్ని చూరగొనాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని ప్రభుత్వం చేసిన ప్రతి పథకం పై ప్రజల్లో చర్చ జరపాలన్నారు. ప్రజల్లో నాయకులు నడవడి, ప్రవర్తన సక్రమంగా ఉండేలా చూస్కోని ప్రజల మద్దతును కోరాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులంతా కలిసి రాబోయే 15 రోజుల పాటు బూతు కన్వినర్లు, కో కన్వినర్లకు సలహాలు, సూచనలు చేయాలన్నారు. కన్వినర్లు ఒటర్ల పూర్తి వివరాలు తీస్కోవాలని భూతు పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.
40 రోజులు ప్రతి బీఆర్ఎస్ ప్రతి నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి మంత్రి గంగుల కమలాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ ను మరో సారి ముఖ్యమంత్రి ని చేయాలన్నారు. ప్రజల మద్దతును తప్పని సరిగా కోరాలని ప్రతి ఇంటికి వెల్లి ప్రజల మద్దతు కోరాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు,ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు వాసాల రమేష్, పిట్టల రవీందర్, జమీల్, సాబీర్ పాషా, గంగుల ప్రదీప్, నేతికుంట హరీష్, గంగాధర చందు, కుల్దీప్, శౌకథ్ అలి, నవాజ్, వాజ్ తదితరులు పాల్గొన్నారు.