Vijay Leo :ఇళయ దళపతిగా పేరు తెచ్చుకు విజయ్ నటిస్తున్న తాజా చిత్ర ‘లియో’. విజయ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నఈ సినిమా పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. దసరాకు థియేటర్లోకి వస్తున్న దీనిపై విజయ్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకన్నారు. అయితే గతంలో వచ్చిన కొన్ని సినిమాలతో విజయ్ కి తెలుగులో నూ ఫ్యాన్స్ పెరిగిపోయారు. దీంతో ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవారు ఎక్కువయ్యారు. కానీ లియో సినిమా తెలుగు హక్కులు రేట్లు భారీగా చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను తెలుగులో రూ.22 కోట్ల రేట్లు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తెలుగులో మార్క్ ను దాటలేకపోయిందని అంటున్నారు.
Vijay Leo : ‘లియో’పై తెలుగులో అనాసక్తి.. ఎందుకంటే?
- Advertisment -