Saturday, July 5, 2025

Brs : బీఆర్ఎస్ రిలీజ్ చేసిన మెనిఫెస్టో ఇదే..

Brs :హైదరాబాద్ (జనతాన్యూస్):  తెలంగాణలో ప్రధానపార్టీ బీఆర్ఎస్ మెనిఫెస్టోను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత అలుముకున్న పరిస్థితులను అర్థం చేసుకున్న తరువాత కొత్త పాలసీలను రూపొందించామని, వెనుకబడ్డ తెలంగాణను బాగుపరచాలంటే సంక్షేమ పథకాలు పెంచాలని అని నిర్ణయించామిన ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ మెనిఫెస్టోలో పేర్కొన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేసీ 2023 మెనిపెస్టోను రూపొందించామని అన్నారు.

మెనిఫెస్టోలో లోని అంశాలు:

కేసీఆర్ బీమా :
రాష్ట్రంలో తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల వరకు ఉచిత బీమా

ఆసరా పెన్షన్ల పెంపు:
ఇప్పటి వరకు ఇస్తున్న రూ.2,016 ఆసరా పింఛన్లను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.3,016 ఆ తరువాత 5 సంవత్సరాల వరకు రూ.5,016 పెంచుతారు.

రైతుబంధు సాయం పెంపు:
రైతుబంధును ప్రతీ ఏటా రూ.10,000 ఇస్తున్నారు. దీనిని అధికారంలోకి రాగానే రూ.12,000 ఆ తరువాత రూ.15,000 వరకు పెంపు

అర్హులైన మహిళలకు రూ.3000:
పేద మహిళలకు జీవన భృతి కింద నెలకు రూ.3000 పంపిణీ

రూ.400లకు గ్యాస్ సిలిండర్:
బీఆర్ఎస్ అధికారంలోక రాగానే అర్హులైన ప్రతి వారికి, అక్రడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు గ్యాస్ ను రూ.400లకే ఇస్తారు.

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు:
ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.5 లక్షలు ఉంది. దీనిని రూ.15 లక్షలకు పెంచారు.

పేదలకు ఇళ్ల స్థలాలు:
ఇల్లు జాగలేని వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ.

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్సియల్ స్కూళ్లు:
అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికిఒకటి చొప్పున రెసిడెన్సియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page