హైదరాబాద్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 50 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి దక్కనివారు నిరుత్సాహంతో ఉన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. వీరిలో సురేష్ షెట్కార్, బలరాం నాయక్, రాజయ్యలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిస్తున్న తమకు తొలి జాబితాలో పేర్లు లేకపోవడం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వచ్చే జాబితాలోనైనా తమ పేర్లు ఉంటాయా? లేవా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో పార్టీలో మరోసారి అలజడి నెలకొంది.
మధుయాష్కి ఇంట్లో కాంగ్రెస్ నేతల భేటీ
- Advertisment -