హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో చెక్ పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సోమవారం ఉదయం నగరంలోని మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు లభ్యమైంది. ఎలాంటి పత్రాలు లేకుండా 27 కిలోల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోలెరో కారులో బషీర్ బాగ్ లోని ఓ నగల దుకాణం నుంచి ఈ ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 14 కోట్ల 70 లక్షల రూపాయల విలువ చేసే సొత్తు సీజ్ చేసినట్లు మియాపూర్ పోలీసులకు అప్పగించారు.
మియాపూర్ లో భారీగా నగదు పట్టివేత
- Advertisment -