అహ్మదాబాద్: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా హై వోల్టేజ్ ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఆట ఆసక్తికరంగా ఉంటుంది. ఇక వరల్డ్ కప్ లో మరింత ఉత్కంఠ నెలకొంటుంది. అయితే వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. శనివారం జరిగిన మ్యాచ్ లోనూ భారత్ అదే జోరు కొనసాగించింది. వరుసగా 8వ సారి గెలిచి రోహిత్ శర్మ సేన క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
వరల్డ్ కప్ లో మ్యాచుల్లో భాగంగా భారత్ మూడో మ్యాచ్ పాకిస్తాన్ తో అక్టోబర్ 14న శనివారం తలపడింది. ఇందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదిక అయింది. టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ముందు నుంచే బౌలర్లు తమ ప్రతాపం చూపి స్కోరు పెరగకుండా కట్టడి చేశారు. ఆ తరువాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. రౌండ్ రౌండ్ లో భారత బ్యాటర్లు బాదుడే బాదడు.. అన్నట్లు బార్డర్ల వైపు బాళ్లను పంపించారు. వన్డే మ్యాచ్ అయినా టీ 20 తరహాలో ఆడుతూ చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 86 పురుగులు చేయగా భారత పేసర్ బుమ్రా మరోసారి తన మ్యాజిక్ నుప్రదర్శించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
తొలుత బ్యాటింగ్ పట్టిన పాకిస్తాన్ 50 ఓవర్లల్లో 42.5 ఓవర్లలో 191 కే ఆలౌట్ అయింది. ఈ స్థితిలో చివరి 36 పరుగుల్లో 8 వికెట్లు కోల్పోయింది. బాబర్ అజమ్ ఒంటిచేత్తో హాఫ్ సెంచరీ చేశాడు. ఐగుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. పాక్ స్కోరు పెరగకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. బూమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్ దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలా 2 వికెట్లు తీసుకున్నారు.
ఆ తరువాత బ్యాటింగ్ పట్టిన భారత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 4 ఫోర్లు కొట్టి ఫాంలోకి వచ్చాడు. ఆ తరువాత 16 పరుగులకే ఔట్ అయ్యాడు. రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి సైతం 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ 53 పరుగులు చేశారు. వీరికి కేఎస్ రాహుల్ 19 తో సపోర్టుగా నిలిచి మొత్తానికి భారత్ ను గెలిపించారు.