జనతా న్యూస్ బెజ్జంకి: రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం లో పల్లె పల్లెలో పార్టీ నీ పటిష్టపరచడమే ధ్యేయంగా, క్షేత్రస్థాయిలో యువతను ఆకర్షించుకుంటూ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా, శనివారం బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గుగ్గిల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా తిప్పర వేణి బాబును ఏకగ్రీవంగానియమించడం జరిగింది.

మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పులి సంతోష్ గౌడ్
బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లూరు గ్రామానికి చెందిన పులి సంతోష్ గౌడ్ ను శనివారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మానకొండూర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన నివాసంలో నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా పులి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, గుగ్గిళ్ళ మాజీ సర్పంచ్ మరియు బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడుచెప్పాల శ్రీనివాస్ గౌడ్, వడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు మంద శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహంకాళిప్రవీణ్,కిసాన్ సేల్ అధ్యక్షులు రోడ్ల మల్లేశం, బీసీ సెల్ అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంకటి రాములుతదితరులు పాల్గొన్నారు.