Kcr :హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలోబీఆర్ఎస్ కదన రంలోకి దిగేందుకు రెడీ అయింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇక ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ లో జరిగే సభతో కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 9 వరకు కేసీఆర్ ప్రచారంలో బిజీ కానున్నారు. హుస్నాబాద్ లో నిర్వహించేసభలో బీఆర్ఎస్ కు సంబంధించిన మెనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. వాటికి మించి అన్నట్లుగా బీఆర్ఎస్ కొత్త పథకాలు ప్రవేశపెడుతుందని కొందరు అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాల నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడున్న పథకాల పరిధినే పెంచుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండా హుస్నాబాద్ లో నిర్వహించే సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ఈ సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభాస్థలి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేసతీష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు హుస్నాబాద్ లక్ష్మీ నియోజకవర్గమని, అందుకే ఇక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.