Aarepally Mohan: మానకొండూర్, జనతా న్యూస్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరెపల్లి మోహన్ గురువారం బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2009లో ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2014లోజరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈసారి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి సిట్టింగులకే టికెట్ కేటాయించడంతో ఆరెపల్లిమోహన్ తనకు సముచిత స్థానం లభించలేదని భావించారు. ఈ మేరకు కొన్ని రోజుల కిందటే పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా బీజేపీలోకి చేరడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మరోవైపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరడంతో మానకొండూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Aarepally Mohan: బీజేపీ కండువా కప్పుకున్న ఆరెపల్లి మోహన్
- Advertisment -