మంథని, జనతా న్యూస్: మంథని మండలం గుమ్మనూరు గ్రామంలో ‘గడప గడప కాంగ్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాల గురించి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ను ఆదరించండి శ్రీధర్ బాబును గెలిపించండి అని ప్రజలను కోరారు. ప్రతి ఇల్లు తిరుగుతూ ఆ పార్టీ ప్రకటించిన కాంగ్రెస్ అభయహస్తం, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కోసం ఐదు లక్షల రూపాయలు, ప్రతి మహిళకు ప్రతినెలా 2500 రూపాయలు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, భూమిలేని వారికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 12,000. ఒకే కాలంలో రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయడం వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్వహిస్తుందని వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని రాబోయే ఎన్నికల్లో శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Manthani : మంథని మండలంలో ‘గడప గడపకు కాంగ్రెస్’
- Advertisment -