Amitab Bachchan:బాలీవుడ్ గురించి చెప్పుకునే ముందు బిగ్ బి గురించి చెప్పుకుంటారు. దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీలో ఏలుతున్న స్టార్ హీరోల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. సాధారణ నటుడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన అమితాబ్ ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా తన పాత్రకు న్యాయం చేస్తున్న అమితాబ్ బచ్చన్ నేటితో 81 ఏళ్లు. 1969లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..
1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగలో అమితాబ్ బచ్చన్ జన్మించారు. అమితాబ్ కుమొదట ఇంక్విలాబ్ అని పేరు పెట్టారు. ఆ తరువాత అమితాబ్ గా మారింది. చదువు పూర్తయిన తరువాత అమితాబ్ బచ్చన్ తన 20 ఏట ఉద్యోగం వదిలి ముంబై చేరారు. సునీల్ దత్ సినిమా ‘రేష్మా ఔర్ షేరా’లో ఒక మూగవాడి పాత్రలో కనిపించాడు. ఆ తరువాత 1969లో ‘సౌత్ హిందుస్థానీ’ అనే సినిమాలో ఏడుగురు హీరోల్లో అమితాబ్ ఒకరిగా నటించారు.
అక్కడి నుంచి అలుపెరగని ప్రయాణం అమితాబ్ బచ్చన్ ది అని చెప్పవచ్చు. 1971లో ఆనంద్ మూవీ నుంచి వచ్చిన ‘షెహెన్ షా’ అనే మూవీ వరకు అన్నీ వందరోజులు ఆడిన సినిమాలే. అమితాబ్ కెరీర్ లో పెద్ద హిట్టుగా నిలిచింది ‘జంజీర్’. ఏ పాత్ర ఇచ్చిన అందుకు తగ్గట్టుగా నటిస్తూ అశేష ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. 1973లో అమితాబ్ జయబాదురిని పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లోనే కాకుండా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ స్పెషల్ కార్యక్రమంతో ప్రత్యేకంగా నిలిచాడు.