కరీంనగ్, జనతాన్యూస్: మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాల్సిన సమయం వచ్చిందని ‘మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అసోసియేషన్’ రాష్ట్ర అధ్యక్షుడు రాదండి వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ది మహేష్ కుమార్ లు అన్నారు. మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రాదండి వెంకటేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ది మహేష్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్లో మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులకు సమావేశం నిర్వహించుటకు ఎలాంటి వేదిక లేకుండా ఉండటం వలన చాలా ఇబ్బందికరంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనుటకు సంఘటితముగా ఉండి సమావేశ మందిరం నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మొదటి వార్షికోత్సవ సంబరాలలో మహిళ సభ్యులు బతుకమ్మలతో నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొడ్ల మారుతి తన సొంత ఖర్చుతో చీరలు కానుకగా అందజేశారు. ీ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు మహిళలను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాదండి వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ది మహేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట సత్యనారాయణ, జక్కని మచ్చయ్య, మీడియా సెల్ మియపురం లక్ష్మీనారాయణ, ముఖ్య సలహాదారు కారంగుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి కనపర్తి మురళి, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ కంకణాల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు గండ్ర నర్సింగరావు, మందల సేనా రెడ్డి మహిళ నాయకురాలు ఎర్రవెల్లి ఉమా, మేకల మాధవి, నీలం అనిత, కొరిమి పద్మ, సుహాసిని జిల్లా నాయకులు మేడిశెట్టి శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు,