పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంథని మండలం నెల్లిపల్లి గ్రామానికి చెందిన అశోక్, సంగీత అనే దంపతులు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అయితే ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమేనని పోలీసులు ప్రాథమిక విచారణకు నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
- Advertisment -