కరీంనగర్ ఎల్‌ఎండి గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులనున్నారు అధికారులు. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లోతో దిగువకు నీటిని వదిలేందుకు నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు ఎల్‌ఎండీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 5000 క్యూసెక్కుల నీనటిని దిగువకు వదులు తున్నట్లు అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతంలో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా గొర్ల కాపరులు, మత్స్య కారులు, రైతులు ఎవరూ మానేరులోకి వెళ్ల రాదని హెచ్చరికలు జారీ చేశారు. కాగా..ఎల్‌ఎండీ పూర్తి స్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.861 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10200 క్యూసెక్కులు మిడ్ మానేరు ద్వారా, 1745 రివర్ ద్వారా, మొత్తం 11, 945 క్యూసెక్కుల నీరు వస్తుండగా..ఎల్‌ఎండీ నుండి కాకతీయ కెనాల్ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మరో 5 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు వదలనున్నారు అధికారులు.
4 గంటలకు ఎల్‌ఎండీ నీటి విడుదల

- Advertisment -