మంథని, జనతా న్యూస్: ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంథని పట్టణంలోని తమ్మి చెరువు కట్ట వీధిలో గల శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహావాది విజయకుమార్, మహవాది శివ, శ్రీరంభట్ల శ్రీనివాస్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రవేశించిన శ్రీధర్ బాబు మొదట విగ్నేశ్వరున్ని దర్శించుకున్న అనంతరం దక్షిణామూర్తిని దర్శించుకున్నారు. శ్రీ బిక్షేశ్వర స్వామికి వేద పండితులు కాచే లింగన్న, ఆలయ పూజారి పల్లి సంజీవ్ లు స్వామివారికి శ్రీధర్ బాబుతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించారు.
ఈ సందర్మంభంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా పాడి పంటలతో వర్షాలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన శివుడిని కోరుకున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటిని తూచా తప్పకుండా అమలు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. వేసవికాలంలో రైతుల పంటలకు సరిపడే నీళ్లు అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ గా ఇస్తున్నామన్నారు. తెలిపారు.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎల్ ఆర్ ఎస్ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి గైడ్లైన్స్ తీసుకోలేదన్నారు. అనంతరం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు పట్టణ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటరి రాజు ఏర్పాటుచేసిన అల్పాహారం శ్రీధర్ బాబు చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. అలాగే శ్రీరంభట్ల సంతోషి శ్రీనివాసులు ఆర్టీసీ దీప వద్ద మజ్జిగ ప్యాకెట్లను, అలాగే లోకి మనోహర్ శరత్ లు శ్రీపాద కాలనీ వద్ద ఏర్పాటుచేసిన ఫలహారాన్ని శ్రీధర్ బాబు భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్, శ్రీరంభట్ల శ్రీనివాస్, పెంటరి రాజు, పెండ్రి సురేష్ రెడ్డి, పెరవేణి లింగయ్య యాదవ్, శశి భూషణ్ కాచే, చొప్పకట్ల హనుమంతరావు, లైసెట్టి రాజు, పల్లి వేణు మహిళా నాయకురాళ్ళు పెండ్రి రమాదేవి, శ్రీరంభట్ల సంతోషి, మారుపాక నిహారిక, ఆయేషా బేగం తదితరులు ఉన్నారు.