వేములవాడ-జనత న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం మహా లింగేశ్వర గార్డెన్‌లో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచనల మేరకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు విద్యార్హత జీరాక్స్ పేపర్స్‌తో పాటు బయోడాటాతో ఇంటర్వూ లకు హాజరు కావాలని సూచించారు. ఆయా కంపెనీల్లో ఎంపికైన అభ్యర్థులకు రూ. 12 వేల నుండి రూ. 40 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9963357250, 9885346768 సెల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
25న మెగా జాబ్ మేళా..
- Advertisment -