Wednesday, September 18, 2024

2025 నాటికి జోయెటిస్‌ ద్వారా ఉద్యోగాలు

సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌ :
2025 చివరి నాటికి వందలాది సాఫ్ట్‌వేర్‌, పశు వైద్య నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలో మంగళవారం ఆయన జోయెటిస్‌ గ్లోబల్‌ సామర్థ్య కేంద్రాన్ని(జిసిసి) ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్‌ ప్రవేశంతో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ కొత్త మైలు రాయిని దాటిందని పేర్కొన్నారు. పశువులు, పెంపుడు జంతువుల ఔషధాలు, పోషకాల ఉత్పత్తిలో జోయెటిస్‌ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని గుర్తు చేశారు. ఆ సంస్థ ఇక్కడ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి బిజినెస్‌ ఆపరేషన్స్‌, డేటా మేనేజ్‌ మెంట్‌, పరిశోధన, అభివృద్ధి లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. ఇటీవల తమ అమెరికా పర్యటన సమయంలో సిఎం రేవంత్‌ రెడ్డి, తాను జోయెటిస్‌ యాజమాన్యంతో చర్చలు జరిపామని ఆయన గుర్తు చేసారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అతి తక్కువ సమయంలో వారు ఇక్కడ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని మంత్రి అన్నారు. ఈ జిసిసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, పశువులు, జీవాల పెంపకదారులకు ఔషధాల సరఫరా, ఆరోగ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు అందించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో జోయెటిస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సార్బౌగ్‌, జోయెటిస్‌ ఇండియా సామర్థ్య కేంద్రం వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ రాఘవ్‌, టీజీఐఐసి సిఇఓ మధుసూదన్‌, తెలంగాణా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page