కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన ఆధారాల్లేని రూ.18,75,651 నగదు పట్టుకున్నట్ట టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు.టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్ సరైన ఆధారాల్లేేని రూ. 6,00,000,మానకొండూర్ మండలం ఊటూరు గ్రామానికి చెందిన పడాల హరీష్ వద్ద రూ. 12,75,651 నగదు పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన డబ్బును తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని తెలిపారు.
రూ.18 లక్షల నగదు పట్టివేత
- Advertisment -