బలబద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకత శిల్పంకు..
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పూజలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్‌లో ఈ నెల15న జగన్నాథ రథయాత్ర మహోత్సవం జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో ఎక్కువ మంది భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని కళాభారతి ఎదుట ఏర్పాటు చేసిన బలబద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకత శిల్పం వద్ద జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భావోద్వేగం చెందారు. జగత్‌కు నాధుడు జగన్నాథుడు..ఆ దేవుడే భక్తుల వద్దకు రావడం అంటే మహత్తర శక్తి ఉన్నట్టే నన్నారు. 15న జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని కలెక్టర్ భక్తులకు పిలుపునిచ్చారు. జగన్నాధుని బోధనలను అనుసరిస్తూ ప్రజలంతా సన్మార్గంలో పయనించాలని సూచించారు.ఒరిస్సా లోని పూరి జగన్నాథ్ కు గొప్ప చరిత్ర ఉందని..ఇందుకు సంబంధించిన కథను ఆమె వివరించారు.
ఈనెల 15వ తేదీన కరీంనగర్‌లో జరగనున్న జగన్నాథుడి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ కోరారు. రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి ఈ రథయాత్ర ప్రారంభమై శాస్త్రీ రోడ్, క్లాక్ టవర్ మీదుగా వైశ్య భవన్‌కు చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్, రథయాత్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ రాజా భాస్కర్ రెడ్డి, చైర్మన్ కన్న కృష్ణ, కో చైర్మన్లు తుమ్మల రమేష్ రెడ్డి, కోమల్ల రాజేందర్ రెడ్డి, కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, స్వామివారి సైకత శిల్పి రూపకర్త శంకర్, ప్రజ్ఞాభారతి బాధ్యులు, సభ్యులు, పాల్గొన్నారు.