వరంగల్, జనతా న్యూస్: కొన్ని రోజులుగా పలు దొంగతనాలకు పాల్పడుతన్న వారిని అరెస్టు చేయడమే కాకుండా 12 తులాల బంగారం,53 తులాల వెండి వస్తువులు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రూరల్ సీఐ, టౌన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి రమేష్, టౌన్ ఎస్ ఐ టి. రామారావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని గురువారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా వస్తుండగా వారిని పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహించగా వాహన పత్రాలు లేకపోవడంతో వారిని విచారించారు. వీరు ఇరువురు, కన్నా రేణుక తో కలిసి గత కొద్ది రోజుల నుండి కొత్తగూడెం, మహబూబాబాద్ ,మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసి వాటిని వరంగల్ లో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 5 కేసులకు సంబందించిన ప్రాపర్టీ ని స్వాధీనపర్చున్నారు. మొత్తం స్వాధీన పరుచుకున్న సొత్తు విలువ 5,60,000 ఉంటుందని తెలిపారు.
12 తులాల బంగారం,53 తులాల వెండి వస్తువులు స్వాధీనం..
- Advertisment -