Wednesday, July 2, 2025

12 TH FAIL సినిమా చూడాల్సిందే..

12 TH FAIL సినిమా చూడాల్సిందే. ఈ సీనిమా ఓ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది’ ఈ మాటన్నది ఎవరో కాదు. సీజేఐ జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌. ఈ సినిమా చూస్తే ప్రజల కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తి వారిలో కలుగుతుందని సీజేఐ చెప్పండం విశేషం. సుప్రిం కోర్టు ఆవరణలో ఈ సినిమా ప్రదర్శించగా..సీజేఐతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు కుటుంబ సభ్యులతో కలసి సినిమా తిలకించారు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ జీవితాన్ని ఆధారంగా తీసుకుని మిథువినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మైసి, మేధా శంకర్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన సీజేఐ చంద్రచూడ్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలతో పాటు ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ, ఐఆర్‌ఎస్‌ అధికారిణి శ్రద్ధాజోషి – దంపతులను ప్రశంసించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page