ఇల్లంతకుంట జనతా న్యూస్: పదో తరగతి పరీక్షాఫలితాలలో ఇల్లంతకుంట మండలంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.గత మార్చి నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మండలం నుండి 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్తూర్బా మోడల్ స్కూల్ గురుకుల తదితర పాఠశాల నుండి 163 మంది బాలురు 244 మంది బాలికలతో కలిపి మొత్తం 407 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు మోడల్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు 10 జిపిఎ సాధించగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన సుమారు 45 మంది విద్యార్థులు 8 నుంచి 10లోపు జిపిఎ సాధించారు ఇల్లంతకుంట మండలం తొలిసారిగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో మండల ప్రజలు పిల్లల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు
10th Results: ఆ మండలంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత
- Advertisment -